విధాత, హైదరాబాద్ : తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మంత్రికి చెందిన రాఘవ కనస్ట్రక్చన్ కంపెనీ భుగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుంది. అయితే టెండర్ దక్కించుకున్న సంస్థ ఏడాది గడిచినా ఇంకా పనులు ప్రారంభించక పోవడంతో ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది. నెల లోపు వెంటనే పనులు ప్రారంభించాలని తెలిపింది. ఇచ్చిన గడువులోగా పనులు ప్రారంబించక పోతే కంపెనీపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు కేంద్రం ఇచ్చిన గడువులోగా పూర్తి కాకపోతే.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ నిలిచిపోతుందని ఈ సందర్భంగా ఏపీ అధికారులు గుర్తు చేశారు.
Ponguleti Srinivasa Reddy | మంత్రి పొంగులేటికి ఏపీ ప్రభుత్వం నోటీసులు
తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మంత్రికి చెందిన రాఘవ కనస్ట్రక్చన్ కంపెనీ భుగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుంది

Latest News
ఎంతకాలం విచారించాలి: ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీం కోర్టు అసహనం
నెట్ఫ్లిక్స్లో కొత్త సినిమాల పండగ..
ఓటీటీలో.. కృష్ణ బురుగుల ‘జిగ్రిస్’ సంచలనం
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రగ్యా జైస్వాల్ ట్రెండీ లుక్స్ అదుర్స్.. ఫొటోలు
శృతి మించిన ఏపీ సంక్రాంతి రికార్డింగ్ డాన్స్ లు !
‘డ్రాగన్’కు బాలీవుడ్ టచ్..
సంక్రాంతి అల్లుడికి 290వంటకాలతో కొత్త రికార్డు!
అమలాపురంలో టెస్లా కారు క్రేజ్ .. సెల్పీలతో జనం సందడి
నెట్ఫ్లిక్స్లో పవర్ స్టార్ హంగామా..