MEDAK: రూ.20 కోట్ల 51లక్షల 89వేల మున్సిపల్ బడ్జెట్‌కు ఆమోదం

బ‌డ్జెట్ స‌మావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పాలక మండలి సభ్యులు విధాత, మెదక్ బ్యూరో: మెదక్ మున్సిపల్ 2023 -24 బడ్జెట్‌ను మున్సిపల్ పాలక వర్గం ఆమోదించింది. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడారు. నూతనంగా మెదక్ జిల్లా ఏర్పడ్డ తరువాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకెళుతున్నదని అన్నారు. […]

  • Publish Date - February 28, 2023 / 04:58 PM IST

  • బ‌డ్జెట్ స‌మావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా
  • అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పాలక మండలి సభ్యులు

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ మున్సిపల్ 2023 -24 బడ్జెట్‌ను మున్సిపల్ పాలక వర్గం ఆమోదించింది. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడారు. నూతనంగా మెదక్ జిల్లా ఏర్పడ్డ తరువాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకెళుతున్నదని అన్నారు. చక్కటి విశాలమైన రహదారులతో పాటు, రహదారుల కిరువైపులా మొక్కలతో మెదక్ పట్టణాన్ని సుందరీకరిస్తున్నామని, త్వరలో రూ.10 కోట్లతో గోసముద్రాన్ని అంద‌మైన పార్కుల‌తో ఏర్పాటు చేయనున్నామని అన్నారు.

రూ.20 కోట్ల 51 లక్షల 89 వేలతో రూపొందించిన 2023-24 సంవత్సరపు అంచనా బడ్జెట్‌ను స‌మావేశం ఆమోదించిందన్నారు. అయితే నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి త్వరలో రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని నిధులు మంజూరు చేసే అవకాశమున్నందున బడ్జెట్ అంచనాలను మరో రూ.10 కోట్లు పెంచుతూ ఆమోదించ‌డానికి సమావేశం తీర్మానించింది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 27 కోట్ల 2 లక్షల నుంచి 16 కోట్ల 68 లక్షల 81వేలకు సవరించిన బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపిందన్నారు.

వీటిలో ఆస్తి పన్ను, అసైన్డ్ రెవెన్యూ ద్వారా 6 కోట్ల 64 లక్షలు, అద్దెలు, టౌన్ ప్లానింగ్, సానిటిషస్, ఇంజినీరింగ్ తదితర పన్నేతర వనరుల మార్గాల ద్వారా 6 కోట్ల 13 లక్షల 89 వేలు, డిపాజిట్లు, అడ్వాన్స్ ల ద్వారా 24 లక్షలు, నాన్ ప్లాన్, ప్లాన్, ఇతర గ్రాంటుల ద్వారా 7 కోట్ల 50 లక్షలు వస్తాయని అంచనా వేశామని తెలిపారు. కాగా వీటిలో జీతాలు, వేతనాలు, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్, హరితహారం కార్యక్రమాలకు 8 కోట్ల 24 లక్షల 33 వేలు ఖర్చు చేయుటకు ప్రతిపాదించామన్నారు.

అదేవిధంగా ఇంజనీరింగ్, పరిపాలన, టౌన్ ప్లానింగ్ విభాగాల నిర్వహణకు 1 కోటి 56 లక్షల 23 వేలు, వార్డు వారీగా, ప్రజా సౌకర్యాలు తదితర వాటికి 2 కోట్ల 92 లక్షల 32 వేలు, ప్లాన్, నాన్ ప్లాన్ తదితర గ్రాంట్ల క్రింద 7 కోట్ల 50 లక్షలు, డిపాజిట్లు, రుణాల చెల్లింపుకు 27 లక్షలు ఖర్చు చేయనున్నామని, 2 లక్షల ఒక వేయి మిగులు బడ్జెట్ ఉంటుందని అన్నారు. వార్డు వారీగా ఏఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఇవ్వాలో చర్చించడం జరిగిందని, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంలో బల్దియాను అన్ని విధాల అభివృద్ధి ప‌థంలో తీసుకెళ్ల‌డానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

సుభాష్ రోడ్, నస్కల్ రోడ్, దాయర రోడ్ విస్తరణ పనులతో పాటు వార్డులలో సి.సి.రోడ్లు, మురుగు కాలువలు వంటి నిర్మాణ పనులు ప్రాధాన్యత క్రమంలో చేపడతామని అన్నారు. ప్రజలు మనమీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మురికివాడల నుండి ప్రతి వార్డు శుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు కాలువలు శుభ్రం చేస్తుండాలి, వర్షపు నీరు ఆగకుండా చూడాలని మునిసిపల్ కమీషనర్ కు సూచించారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ వాస్తవిక బడ్జెట్ రూపొందించామని, ప్రతిపాదించిన అంచనాలకు అనుగుణంగా నిధులు సమీకరించడంతో పాటు నిర్దిష్టమైన పనులు చేపట్టి సకాలంలో ఖర్చు చేయుటలో శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో కౌన్సిలర్లు సమావేశంలో అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి సూచనలు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ జిల్లా ఏర్పడ్డ తరువాత రైలు, మాతా శిశు సంరక్షణ కేంద్రం, గురుకుల పాఠశాలలు తెచ్చుకున్నామని, త్వరలో క్రిటికల్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోనున్నామని అన్నారు. అందరి సహకారంతో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతున్నదని, ఇకముందు కూడా అందరం అభివృద్ధి పథంలో చేయి చేయి కలిపి పనిచేద్దామని అన్నారు.

అనంతరం జరిగిన పురపాలక సంఘ సాధారణ సర్వ సభ్య సమావేశంలో పలు ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మునిసిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, కౌన్సిలర్లు, మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News