KTR Bandi Sanjay Meet | విధాత: రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉంటూ తరుచూ పరస్పరం మాటల తూటలు పేల్చుకునే ఆ నాయకులను వరద కలిపింది. బీజేపీ(BJP) నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) లు అనూహ్యంగా వరద ప్రాంతాల పర్యటనలో కలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే సిరిసిల్లలో(Siricilla) వరద బాధిత ప్రాంతాలలో బండి సంజయ్ పర్యటించి వెలుతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక సిరిసిల్ల ఎంఎల్ఏ కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు.
వారిద్దరూ యాదృచ్చికంగా ఎదురెదురు పడటంతో మర్యాద పూర్వకంగా కలుసుకుని పరస్పరం అభివాదం కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరు ఏం మాట్లాడుకున్నారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకులు ఈ ఆకస్మిక పరిణామాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతూ బండి, కేటీఆర్ ల నాయకత్వం వర్ధిల్లాలంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. మరోవైపు కామారెడ్డి(Kamaredy), మెదక్(Medak) జిల్లాలు వదిలి బండి సంజయ్ సిరిసిల్ల రావడం కేవలం రాజకీయం కోసమేనన్న ప్రచారం కూడా వినిపిస్తుంది.