Site icon vidhaatha

అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు విద్యార్థి, నిరుద్యోగ ఉద్య‌మం

విధాత‌: విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి అన్ని పక్షాలు మద్దతు తెలిపాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గాంధీభవన్‌లో గురువారం నిర్వహించిన అఖిలపక్షభేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. ‘‘అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మాతో కలసివచ్చే పార్టీలను కోరడం జరిగింది. మా ప్రతిపాదనకు మీటింగ్‌లో పాల్గొన్న అన్ని పక్షాలు సూత్రప్రాయంగా మద్దతు తెలిపాయి. పోడు భూములు, ఇతర సమస్యలపై కాంగ్రెస్ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతామన్నాయి. మాతో కలిసి వచ్చే పార్టీలే కాదు.. ఆ పార్టీల అనుబంధ సంఘాలు కూడా మాతో కలసి పని చేస్తాయి’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

Exit mobile version