విధాత:రేవంత్ రెడ్డిని టిపిసీసీ అధ్యక్షుడు గా ప్రకటించడంతో ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన భట్టి విక్రమార్క తో పాటు పార్టీలో అత్యంత సీనియర్ నాయకులయిన జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వి హనుమంత రావు,లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతల సంగతి ఏమిటి పార్టీలో వారి స్థానమేమిటనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ఏఐసిసి పెద్దలు ఇలాంటి కార్యవర్గాన్ని ప్రకటిస్తారని ముందే ఊహించిన భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తదితరులు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో పోలీసుల దాష్టీకానికి బలైన మరియమ్మ విషాద సంఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురావడానికి కెసిఆర్ ను వెళ్లి కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటే ఎవరినైనా కలుస్తారు, కాదంటే ఎంత దగ్గరి వారినైనా ప్రగతిభవన్ గేటు లోపటికి కూడా అడుగుపెట్టనివ్వరనే పేరు సహజంగానే ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ నాయకులకు ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చారని ఇది కెసిఆర్ రాజకీయ వ్యూహంలో ఒక భాగమని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. మరి కొందరు బహిరంగంగానే ఈ విషయంపై వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో సహా చాలా మంది కాంగ్రెస్ నాయకులే స్పందించారు. కాంగ్రెస్ నాయకులు ఇలా వెళ్లి సీఎం ను కలవడం సరైంది కాదని కూడా వ్యాఖ్యానించారు .అలాంటి కామెంట్లను సంగారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి వ్యతిరేకిస్తూ తిప్పి కొట్టారు. ప్రజా సమస్యల గురించి సీఎం ని కలిస్తే తప్పేంటని ఆయన ఎదురు దాడి చేశారు. ఇక గతంలో ప్రతిపక్ష నాయకులు ఎంతో మంది గతంలోని ముఖ్యమంత్రులను కలవ లేదా అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో ముసలం
<p>విధాత:రేవంత్ రెడ్డిని టిపిసీసీ అధ్యక్షుడు గా ప్రకటించడంతో ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన భట్టి విక్రమార్క తో పాటు పార్టీలో అత్యంత సీనియర్ నాయకులయిన జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వి హనుమంత రావు,లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతల సంగతి ఏమిటి పార్టీలో వారి స్థానమేమిటనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.ఏఐసిసి పెద్దలు ఇలాంటి కార్యవర్గాన్ని ప్రకటిస్తారని ముందే ఊహించిన భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) దుద్దిళ్ళ శ్రీధర్ బాబు […]</p>
Latest News

వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమా 'ఆదర్శ కుటుంబం'
పెళ్లి లోపే మహిళలు అనుభవిస్తున్నారు.. జనవరి 1న స్వామి వ్యాఖ్యలపై విచారణ
రూ. 1000 కోట్లతో స్టార్ట్ అప్ ఫండ్ : సీఎం రేవంత్ రెడ్డి
రోడ్డెక్కిన 65కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..జెండా ఊపిన మంత్రి పొన్నం
లక్ష్యం రూ.3 లక్షల కోట్లు... ఒప్పందాలు రూ.5.75లక్షల కోట్లు
గ్లోబల్ సమ్మిట్ కాదు..రియల్ ఎస్టేట్ ఎక్స్ పో: హరీష్ రావు
‘అఖండ 2’ కొత్త డేట్‌తో చిత్ర విచిత్రంగా చిన్న సినిమాల పరిస్థితి..
రేపు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
అర్హ బర్త్‌డే ట్రిప్‌లో స్నేహా రెడ్డి కొత్త అవతారం…
ఇంకాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి