Site icon vidhaatha

రేవంత్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, బీఆరెస్ కుట్ర … మాజీమంత్రి పుష్పలీల

హైదరాబాద్ కేంద్రంగా అల్లర్లకు బీజేపీ కుట్ర
రేవంత్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, బీఆరెస్ ప్రయత్నాలు
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ ను బేస్ చేసుకొని అల్లర్లు సృష్టించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని, ప్రజలు అలాంటి రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పుష్పలీల సూచించారు. సోమవారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన కొనసాగుతుందని, రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. తెలంగాణలో బీజేపీ, బీఆరెస్‌ పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్తు కొనుగోలు, ఫ్లాంట్ల నిర్మాణాల్లో, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అక్రమాలు చేసిన నాయకులను కేసీఆర్ విదేశాలలో పెట్టి ఇక్కడికి రానియ్యకుండా అడ్డుకుంటున్నాడని పుష్పలీల కీలక ఆరోపణలు చేశారు. విద్యుత్తు కొనుగోళ్ల స్కామ్ లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారని కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కూతురు కవిత కూడా నాకు భయం అవుతుందని జైల్లో ఏడ్చిందని వాళ్ళ నాయకులే చెప్తున్నారన్నారు. నన్ను ప్రధాన మంత్రిని చెయ్యమని ఎన్‌డీఏ నేతల కాళ్ళు మొక్కి మోడీ అధికారంలోకి వచ్చిండని విమర్శించారు. దమ్ముంటే ఈవీఎంలను తీసేసి ఎన్నికలకు వెళ్ళమని రాహుల్ గాంధీ చెప్పారని, కానీ మోడీకి ఆ ధైర్యం లేదు, ఈవీఎంలను నమ్ముకొని గెలిచిండని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రధాని ఈవీఎంలతో అత్యంత ప్రమాదం అని చెప్పారని, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి ఓడిపోవడానికి ఈవీఎం కారణమని చెప్పి మరీ ప్రూవ్ కూడా చేశాడన్నారు. ఎలన్ మస్క్ వంటి వారు కూడా ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెప్పారని గుర్తు చేశారు.

Exit mobile version