విధాత: రాష్ట్రంలోఉన్న రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల కలెక్టరేట్ ల ఎదుట బీజేపీ అధ్వర్యంలో మంగళవారం ధర్నాలు నిర్వహించారు. లక్ష రూపాయల రుణ మాఫీ వెంటనే అమలు చేయాలని, ఉచితంగా ఎరువుల పంపిణీ చేయాలని, తప్పుల తడకల ధరణిని రద్దు చేయాలని, వ్యవసాయ పనిముట్లను రాయితీ పై పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టరేట్ ల ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, కాసం వెంకటేశ్వర్లు, పివి శ్యాంసుందర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పి.జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట ధర్నాలో సంకినేని వెంకటేశ్వరరావు, బూర నరసయ్య గౌడ్ హాజరయ్యారు. నల్గొండ కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, నూకల వెంకట్ నారాయణ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు దాశోజు యాదగిరా చారి, జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, శణగొని రాములు, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు సీతారాములు, జిల్లా కార్యాలయ కార్యదర్శి చింత ముత్యాల్ రావు, జిల్లా కార్యదర్శి పోతేపాక లింగస్వామి, సాదినేని శ్రీనివాస్ రావు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అయితరాజు సిద్దు, కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి పాలకూరి ఎలెంద్ర గౌడ్, మహిళ మోర్చాఅధ్యక్షురాలు కొండేటి సరిత, కన్మంతా రెడ్డీ శ్రీదేవి రెడ్డీ, పట్టణ అధ్యక్షురాలు నేవర్సు నీరజ తదితరులు పాల్గొన్నారు.