జూబ్లీహిల్స్‌కు ప్రథమ ప్రాధాన్యత: మంత్రి పొన్నం

హైదరాబాదులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కాదు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని బ్రాండ్ ఇమేజ్ కాపాడే విధంగా అన్ని సమస్యలు పరిష్కరించే ప్రక్రియ మొదలుపెట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు

  • Publish Date - September 14, 2025 / 04:54 PM IST

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విధాత): హైదరాబాదులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కాదు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని బ్రాండ్ ఇమేజ్ కాపాడే విధంగా అన్ని సమస్యలు పరిష్కరించే ప్రక్రియ మొదలుపెట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్‌లో జయ ప్రకాష్ కాలని, ఇంజనీర్స్ కాలని ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావులు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో జూబ్లీహిల్స్‌కి ప్రథమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అన్ని ఏరియాల్లో సమస్యలను లికిత పూర్వకంగా కాగితంలో రాసివ్వండి.. వారం రోజుల్లో ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు.

1923 లో నిజాం కాలంలో హిమాయత్ సాగర్ , నిజాంసాగర్, తరువాత సింగూరు , మంజీరా జలాలు కృష్ణ ఫేజ్ 1,2,3 ,గోదావరి ఫేజ్ 1 కి హైదరాబాద్‌కు తాగునీరు తీసుకొచ్చామన్నారు. ఇప్పటి వరకూ నగరానికి 630 MLD నీళ్లు వస్తున్నాయని తెలిపారు. గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం చాలా పెరిగింది.. అవసరానికి తగిన విధంగా నగరానికి నీళ్లు తీసుకువచ్చే కార్యక్రమాలు ఏమి చేయలేదన్నారు. కాలని లో ఇబ్బందులు లేకుండా అభద్రత భావం లేకుండా నైట్ పెట్రోలింగ్ అడుగుతున్నారు.. వెంటనే పోలీసులు నైట్ పెట్రోలింగ్ పెంచాలని ఆదేశించారు. ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి బలోపేతం చేయాలని మంత్రి కోరారు.