బీజేపీ నేతలు డూబ్లికేట్ దేశ భక్తులు: జ‌గ్గారెడ్డి

బీజేపీ నేత‌లలు డూబ్లికేట్ దేశ భ‌క్తులని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్ర‌వారం గాంధీ భ‌వ‌న్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు లింగం యాదవ్, చరగాని దయాకర్ల‌తో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడారు

  • Publish Date - April 19, 2024 / 06:59 PM IST

బీజేపీ నేత‌లలు డూబ్లికేట్ దేశ భ‌క్తులు

మా అగ్ర‌నేత‌లు అస‌లు దేశ భ‌క్తులు

నార్త్ లో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్

విధాత‌: బీజేపీ నేత‌లలు డూబ్లికేట్ దేశ భ‌క్తులని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్ర‌వారం గాంధీ భ‌వ‌న్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు లింగం యాదవ్, చరగాని దయాకర్ల‌తో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ కుటుంబం ముత్తాత మోతీలాల్ నెహ్రూ నుంచే దేశ భ‌క్తుల కుటుంబమ‌ని తెలిపారు. బీజేపీ వాళ్లు గ్రాఫిక్స్‌ లీడర్స్ అని ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్డీఏ తగ్గుతుంది.. ఇండియా కూటమి పెరుగుతుందని స్ప‌ష్టం చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్లనే ఇండియా గ్రాఫ్ పెరిగింద‌న్నారు. నార్త్ లో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని జ‌గ్గారెడ్డి వెల్ల‌డించారు. మూడో స్థానంలో ఉన్న బీజేపీ సోష‌ల్ మీడియాలో మాత్రం ముందు ఉన్న‌ట్లు ప్ర‌చారం చేసుకుంటుంది, తెలంగాణ ప్ర‌జ‌లు ఆలోచ‌న చేయాల‌న్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి ఎంత మంది ఎమ్మెల్యేలు వ‌స్తార‌నేది ఎన్నిక‌ల త‌రువాత తెలుస్తోంద‌న్నారు. అధికారంలో లేని కేసీఆర్ గేమ్‌ ఆడితే.. సీఎం రేవంత్ గేమ్ ఆడకుండా ఉంటాడా..? అని ప్ర‌శ్నించారు.
ఎమ్మెల్యేల‌ చేరిక అంశం నా పరిధి కాదన్నారు. కేసీఆర్ ఏ ఆలోచనతో ప్రభుత్వం కూలిపోతుందని అన్నారో తెలియదు కానీ ఆయన వ్యూహాన్ని తిప్పి కొట్టే ఆలోచన మా దగ్గర ఉందన్నారు. ఈ ఐదేళ్లు ప్రజలను ఎలా మెప్పించాలనే ఆలోచనలో ఉన్నామ‌న్నారు. వంద మంది ఉన్న కౌరవులను ఐదుగురు పాండవులు కూల్చేశారన్నారు. ఇక్క‌డ మేము పాండ‌వుల‌మని పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు అయింద‌ని, దేశంలో 76 ఏండ్ల క్రితం ఉన్న పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులని, బీజేపీ చరిత్ర కేవ‌లం 40 ఏండ్లు మాత్ర‌మేన‌న్నారు. మా అగ్ర‌నాయ‌కులు ఒరిజినల్ దేశ భక్తులు కాబట్టి.. వారే దేశ భక్తులమ‌ని చెప్పటం లేదని, బీజేపీ వాళ్లు డూబ్లికేట్ దేశ భక్తులు కాబ‌ట్టే డబ్బాలు కొట్టుకుంటున్నార‌న్నారు. రాహుల్ గాంధీ ముత్తతా మోతిలాల్ నెహ్రు ఆనాడే కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడని తెలిపారు. మోతీలాల్ నెహ్రూ1919, 1928 ల‌లో కాంగ్రెస్ అధ్య‌క్షుయ్యార‌న్నారు. ఆయ‌న‌ది ధ‌నిక కుటుంబమ‌న్నారు. మోతిలాల్ నెహ్రు త‌న‌ సంపదనంతా స్వాతంత్య్రోద్య‌మం కోసం పెట్టార‌ని జ‌గ్గారెడ్డి వెల్ల‌డించారు.

Latest News