Site icon vidhaatha

MLA Jagadish Reddy | రుణమాఫీ మోసాన్ని పక్కదారి పట్టించేందుకే దాడులు: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్

బీఆరెస్ విలీనంపై సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు
రాజకీయ కక్షతోనే పార్టీ ఆఫీస్‌పై రాద్ధాంతం

MLA Jagadish Reddy | రుణమాఫీ (Runa Mafi) మోసంపై రైతుల్లో చెలరేగుతున్న అసంతృప్తి నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హింసను, దాడులను ప్రేరేపిస్తున్నాడని, ఇందులో భాగంగానే సిద్ధిపేటలో హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేయించాడని మాజీ మంత్రి, సూర్యాపేట (Suryapet) ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాడ్లాడారు. రాష్ట్రంలో హింస ప్రేరేపించాలి అని రేవంత్ ప్రయత్నం చేస్తోండని, హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి స్వయంగా ప్రభుత్వం చేయించేందేనన్నారు. ఇటువంటి చిల్లర వేషాలకు మేం భయపడమని, ఉద్యమ కాలంలో ఎంతో మంది రాక్షసులను తరిమికొట్టినమని, కేసీఆర్ (KCR) ముందు ఇవి ఏవి నడవవన్నారు.

కాంగ్రెస్ (Congress) చేసిన రుణమాఫీ పచ్చి మోసమని, రుణాలు ఇచ్చేటప్పుడే అన్ని పత్రలు సరిచూసుకునే రుణాలు ఇస్తారని, మరి ఇప్పుడు ఇన్ని కొర్రీలు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టేందుకు అన్నదాతలను దొంగల్లాగా క్రియేట్ చేస్తున్నందని ఆరోపించారు. ఇంతకు మించిన ద్రోహం ఇంకోటి ఉండదని, రైతుల్లారా అర్థం చేసుకోండని, కాంగ్రెస్ మోసాన్ని గ్రహించండని జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) కోరారు. బీఆరెస్ రైతుల తరపున కొట్లాడుతుందని, మేం మీకు అండగా ఉంటామని, ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వాలని, అందరికి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గ్రామాల్లో రైతులు ఐక్యం కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలని కోరారు.

రుణమాఫీపై కాంగ్రెస్ లెక్కలే మోసానికి నిదర్శనం

రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో సహా కాంగ్రెస్ పార్టీ అంతా 2 లక్షల రుణమాఫీ చేస్తాంమని, మొదట 40వేల కోట్లతో 50 లక్షల మంది రైతుల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారని, ఆ తర్వాత కేబినెట్‌లో 31వేల కోట్లని చెప్పారని, బడ్జెట్‌లో 26వేల కోట్లని చెప్పారని, మళ్లీ వారే మాట తప్పి ఇవ్వాళ 17 వెల కోట్లు ఇచ్చి సగం మంది రైతులను నిలువునా మోసం చేశారన్నారు. అందుకే ఇవ్వాళ రైతులు తిరగబడుతున్నారని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడన్నారు.

రేవంత్ రెడ్డి బీజేపీతో దొంగ సంబంధాలు పెట్టుకుని కుమ్మక్కై బీజేపీలో బీఆరెస్ విలీనమవుతుందని పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా బీఆరెస్ పార్టీ కార్యాలయం కూల్చివేతపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయ కక్షతో అనవసర వివాదం చేస్తున్నారని, జిల్లాలో అన్ని పార్టీ కార్యాలయాలు ఉన్న విధంగానే మా పార్టీ ఆఫీస్ కూడా ఉందన్నారు. అన్నిటికీ ఉన్న నిబంధనలే మాకు ఉన్నయని, అన్ని పార్టీలు లాగానే మేమూ మా కార్యకర్తల కోసం దేవాలయం లాంటి ఆఫీస్ ను కట్టుకున్నామని, మా పార్టీ కార్యలయాన్ని కూలుస్తామనడం సమంజసం కాదన్నారు.

Exit mobile version