Site icon vidhaatha

SC RESERVATION | ఎస్సీ వర్గీకరణపై సీఎం కార్యాలయంలో సంబరాలు

విధాత, హైదరాబాద్‌ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతించి, తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని ప్రకటన చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులు,కృతజ్ఙతలు తెలియజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్ని కలిసి పుష్పగుచ్చం అందించి స్వీట్లు తినిపించి సంబురాలు జరుపుకొన్నారు. పార్టీ నేతలతో కలిసి సీఎం డప్పు దరువు వేశారు. సీఎంను కలిసిన వారిలో సీనియర్ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మందుల సామేల్, కడియం శ్రీహరి, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

 

Exit mobile version