Site icon vidhaatha

Kaleshwaram Commission| సీఎం రేవంత్ రెడ్డి చేతికి కాళేశ్వరం నివేదిక..నేడు కీలక భేటీ

Kaleshwaram Commission| కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పీసీ. ఘోష్ కమిషన్( Ghosh Commission)సమర్పించిన విచారణ నివేదిక(Kaleshwaram Report) సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. నిన్న కమిషన్ చైర్మన్ ఘోష్ నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించారు. ఆయన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావుకు అందించగా..అటు నుంచి శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. నివేదికపై ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ.ఘోష్ లు పాల్గొంటారు. నివేదికలోని అంశాలపై వారు చర్చించి.. నివేదికపై ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను న్యాయ పరిశీలనకు పంపించాక..మంత్రివర్గంలో చర్చించి శాసన సభలో చర్చ పెట్టాక..చర్యలు తీసుకునే అవకాశముంది.

జస్టిస్ పీసీ. ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై 15 నెలల పాటు సుధీర్ఘ విచారణ జరిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ ల నిర్మాణాలపై 119మంది అధికారులు, ప్రజాప్రతినిధులను విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేసింది, కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్ నివేదిలను సైతం అధ్యయనం చేసింది. విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లతో సహా ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులను విచారించింది. కమిషన్ సమర్పించిన నివేదికలపై బరాజ్ నిర్మాణలలో అవతవకలకు బాధ్యులుగా ఎవరిని పేర్కొన్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version