విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సొసైటీల స్థాయిలోనే ప్రభుత్వ హాస్టల్స్ లో సమస్యలకు సత్వర పరిష్కారం జరుగాలన్న ఆలోచనతో స్పెషల్ ఫండ్ మంజూరుకు నిర్ణయించింది. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్, హెల్త్ , టీచింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిధుల వైపు చూడకుండా..వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదలకు నిర్ణయించింది.
ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి 20కోట్లు, ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు 10కోట్ల చొప్పున విడుదల చేసింది. సొసైటీ సెక్రటరీకి ఎమర్జెన్సీ ఫండ్ వినియోగించే అధికారాలను కట్టబెట్టింది.
తరచూ గురుకులాల్లో, హాస్టల్స్ లో సమస్యలు బయటపడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా సీఎం సహాయనిధి నుండి రూ.60 కోట్ల ప్రత్యేక నిధులు విడుదలకు నిర్ణయించడం గమనార్హం.