Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి హార్వర్డ్ కెనడీ స్కూల్ సర్టిఫికెట్

అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్‌లో ‘లీడర్‌షిప్ ఫర్ 21వ శతాబ్దం’ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ పొందారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు.

Revanth Reddy

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన కెనడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్‌షిప్‌ ఫర్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ పేరిట నిర్వహించిన తరగతులకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్‌ అందుకున్నారు.

కెనడీ స్కూల్ సర్టిఫికెట్ స్వీకరణ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పంచుకున్నారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరైనట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో భయంకరమైన మంచు తుఫానుతో కూడిన వాతావరణం కొనసాగుతుందని, ఈ పరిస్థితుల్లో తాను ప్రతిష్టాత్మక కోర్సు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Medaram Jatara : అడవి ఉప్పొంగిన వేళ అమ్మ దేవతల దర్శనం
Tension at Medaram | మేడారం జాతరలో ఉద్రిక్తత.. మంత్రి కాన్వాయ్‌పై భక్తుల దాడి

Latest News