CM Revanth Reddy | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ జామర్ కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద వేగంగా వెళ్తున్న సమయంలోనే సీఎం కాన్వాయ్ జామర్ టైర్ పగిలిపోయింది. జామార్ కుడి వైపు ఉన్న వెనుక టైర్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో వాహనాన్ని డ్రైవర్ చాకచక్యంగా కంట్రోల్ చేశాడు. లేదంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది.
విషయం తెలుసుకున్న ట్రాఫిక్ అధికారులు వెంటనే జామర్ వాహనానికి స్టెప్నీ టైర్‌ను అమర్చారు. జామార్‌కు చేయాల్సిన మరమ్మతులు పూర్తయిన వెంటనే మళ్లీ సీఎం వద్దకు ఆ వాహనం చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గతంలోనూ రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది. కారు సడెన్‌గా ఆగిపోయింది. 2024 ఏప్రిల్ 8న రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
