Site icon vidhaatha

Telangana | తెలంగాణ‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు.. త్వ‌ర‌లోనే చైర్మ‌న్ నియామ‌కం

Telangana | హైద‌రాబాద్ : తెలంగాణ‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమ‌రీ నుంచి ఉన్న‌త విద్య వ‌ర‌కు స‌మ‌గ్ర పాల‌సీ త‌యారీకి క‌మిష‌న్ ఏర్పాటు చేసిన‌ట్టు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. చైర్మ‌న్, ముగ్గురు స‌భ్యుల‌తో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌నున్నారు.

క‌మిష‌న్ చైర్మ‌న్, స‌భ్యుల‌ను త్వ‌ర‌లోనే నియ‌మించ‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకురాబోతున్న‌ట్టు ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యా క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కొత్త‌గా ఏర్పాటైన విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్, స‌భ్యులు రెండేండ్ల పాటు త‌మ ప‌ద‌వుల్లో కొన‌సాగ‌నున్నారు.

Exit mobile version