విధాత, హైదరాబాద్ : డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే రోజు సచివాలయంలోని అన్ని కార్యాలయాలతో పాటు రాష్ట్ర మంతటా తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కోన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవాలకు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రకటన చేయడం విశేషం. రాష్ట్ర చిహ్నం మార్పుపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో విస్తృత సంప్రదింపుల అనంతరం చిహ్నం మార్పుపై నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వం వాయిదా వేసింది.
డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రాష్ట్ర మంతటా ఉత్సవాలు…సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే రోజు సచివాలయంలోని అన్ని కార్యాలయాలతో పాటు రాష్ట్ర మంతటా తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కోన్నారు.

Latest News
2025లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీలు..
అఖండ 2 హెచ్ డీ ప్రింట్ లీక్ ..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రోజుకి 20 గంటలు పని..
తుది దశకు బిగ్బాస్ తెలుగు 9 ..
ఈ అధికారులకు ఉద్యోగం చేసే నైతిక అర్హత ఉందా?
మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ (ఎక్సక్లూసివ్ ఫొటోస్)
ఢిల్లీలో లాక్డౌన్? ఆన్లైన్లోనే క్లాసుల బోధన!
బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్! వచ్చేది అక్కడే!
కాల్ చేసినవారి పేరు ఇక డిస్ప్లేలో.. మార్చి నుంచే అమలు!
అమెరికాలో బర్త్ టూరిజంపై బ్యాన్! గర్భిణులకు నో వీసా!