విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించని కేటీఆర్, హరీశ్‌రావులకు ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు వచ్చిందా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వారి పాలన హయంలో గుర్తుకు రాని ప్రోటోకాల్‌పై ఇప్పుడు వారికి గగ్గోలు ఎందుకని మండిపడ్డారు. గత బీఆరెస్ ప్రభుత్వ హయాలంలో తాను కూడా ప్రోటోకాల్ బాధితుడేనని గుర్తు చేశారు. సంగారెడ్డిలో నన్ను విపక్ష ఎమ్మెల్యేగా అవమానించారని… అయినా పెద్ద మనసుతో నేను పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టేవారని.. ఆ సమయంలో హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ పక్కనే ఉండేవారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులు ఈ రోజుల్లో సహజ అంశంగా మారిపోయాయని, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నాయకులు పార్టీలు మారడం సహజమని అది చర్చనీయాంశమే కాదన్నారు. గతంలో కాంగ్రెస్‌ను వీడిన వారు ఇప్పుడు మళ్లీ వస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు. నా దృష్టిలో పార్టీ ఫిరాయింపులు అసలు సీరియస్ మ్యాటర్ కాదని అన్నారు. ప్రజలు కూడా పార్టీ ఫిరాయింపులను సీరియస్‌గా తీసుకోవడం లేదని, అత్తగారి ఇల్లు.. తల్లిగారి ఇల్లులా రాజకీయాలు మారాయని ఈ విషయంపై పదేపదే చర్చించడం అనవసరమన్నారు.
Jaggareddy | మీ పాలనలో ప్రోటోకాల్ పాటించారా .. బీఆరెస్‌పై జగ్గారెడ్డి ఫైర్
బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించని కేటీఆర్, హరీశ్‌రావులకు ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు వచ్చిందా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు

Latest News
నకిలీ ట్రాఫిక్ చలాన్ మెసేజ్‌లు వస్తున్నాయి… అప్రమత్తంగా ఉండండి
ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు : మంత్రి పొంగులేటి
కివీస్‌దే వన్డే సిరీస్ – కోహ్లీ శతక పోరాటం వృథా
తల్లుల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి
సక్సెస్‌తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ.
వార్తలు అడిగి రాయండి: సీఎం రేవంత్ రెడ్డి
హీరోయిన్ ఎంగిలి తాగమన్న డైరెక్టర్..
భారత్ నాకు ఇల్లు..వివాదస్పద వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ
మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా
ఎవరి ప్రయోజనాల కోసమో నాపై కట్టుకథలు సరికాదు : డిప్యూటీ సీఎం భట్టి ఫైర్