విధాత: తెలంగాణ ప్రభుత్వం దీపావళీ సెలవు దినాన్ని 13వ తేదీ సోమవారంకు మారుస్తు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 12వ తేదీ సెలవు దినంగా ప్రకటించగా ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుని 13వ తేదీన సెలవు ప్రకటిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రభుత్వ, ప్రవైటు సంస్థలన్ని అమలు చేయాలని ఆదేశించింది. నిజానికి ఈ దఫా దీపావళీ పండుగ ఆదివారం రావడం, సోమవారం సెలవు దినం కావడం, అంతకుముందు రెండో శనివారం కావడంతో చాలమందికి వరుసగా మూడు సెలవులు కలిసివస్తున్నాయి.