కెసిఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆగం … ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

గత ముఖ్య మంత్రి కెసిఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

  • Publish Date - June 28, 2024 / 04:17 PM IST

విధాత, మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :గత ముఖ్య మంత్రి కెసిఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు.కెసిఆర్ అసమర్ధ పాలన లో తెలంగాణ అప్పుల ఊభి లో కురుకుపోయిందన్నారు.రూ.ఏడు లక్షల కోట్ల అప్పులు రాష్ట్ర ప్రజల పై పెట్టివెళ్లారని, కెసిఆర్ చేసిన అప్పులకు ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38 వేల కోట్లు వడ్డీ చెల్లించిందని యెన్నం పేర్కొన్నారు.ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టారని అందులో భాగంగా పాలమూరు అభివృద్ధి కి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రస్తుతం పాలమూరు లో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించామన్నారు. రూ. 37 కోట్ల వ్యయంతో డ్రెయినేజీ,సీసీ రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేపట్టెందుకు వేసిన టెండర్ ప్రక్రియలో మెఘ కంపెనీ అనే సంస్థకు దక్కిందని ఎమ్మెల్యే తెలిపారు.కేంద్ర మంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి సహకారంతో కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామన్నారు.రాజకీయాలంటే అభివృద్దే ముఖ్యం అనే విధంగా ముందుకు వెళుతున్నామన్నారు.

కేంద్ర,రాష్ట్ర పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.త్వరలోనే వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపడుతామని,విద్యార్థుల శ్రేయస్సు కోసం పాఠశాల లు ప్రారంభించిన మొదటి రోజున పుస్తకాలు,స్కూల్ డ్రెస్ లు పంపిణీ చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పైరవీలకు తావు లేకుండా ఉద్యోగుల ప్రమోషన్లు,బదిలీ కార్యక్రమం పారదర్శకంగా ఆన్ లైన్ లో చేపడుతామన్నారు.గత ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఆగిపోయిన కట్టడాల్లో అవసరమైన మార్పులు చేసి పూర్తి చేస్తామన్నారు.మిషన్ భగీరథ పనుల్లో జరిగిన అవినీతి వల్లే చాలా శాతం వరకు నీరు ప్యూరిపై కాలేక సురక్షిత మంచి నీరు అందడం లేదన్నారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోతైన అధ్యయనం చేస్తోందన్నారు.పట్టణ సరిహద్దుల్లో ఇటుక బట్టీ ల ఏర్పాటు తో కాలుష్యం పెరుగుతోందని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యం లో విచారణ చేస్తున్నామని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఈ సమావేశం లో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు సిరాద్ ఖాద్రి, బెనహర్ పాల్గొన్నారు.

Latest News