విధాత: తెలంగాణలోని అధికార బీఆరెస్ ప్రభుత్వంపై ఎన్నికల సమయంలో నిరుద్యోగులు రకరకాల రూపాల్లో తమ ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఓ నిరుద్యోగి తన ఇంటి ముందు ఎన్నికల ప్రచారానికి వచ్చే బీఆరెస్ పార్టీకి విజ్ఞప్తి పేరుతో పెట్టిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీఆరెస్ పార్టీ వాళ్లు నా ప్రాణ స్నేహితులైనా, నా సొంత బంధువులైనా సరే దయచేసి ఓటు అడగడానికి మాత్రం నా ఇంటికి రాకండి ..ఓ నిరుద్యోగి ఆవేదన అంటూ ఫ్లెక్సీలో విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దానిని కాంగ్రెస్ తమకు అనుకూలంగా ప్రచారంలో వైరల్ చేస్తుండటం ఆసక్తికరం.