విధాత, హైదరాబాద్: యోగా గురువు రంగారెడ్డి(yoga guru Ranga Reddy) హనీట్రాప్ లో చిక్కుకున్నారు. రంగారెడ్డి చేవెళ్లలో యోగాశ్రమం(Chevella yoga ashram) నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలు రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు. కొన్నాళ్లుగా రంగారెడ్డితో ఆ మహిళలు సన్నిహితంగా మెలిగారు. రంగారెడ్డితో ఆ మహిళలు సన్నిహితంగా ఉంటూ ఆయనకు తెలియకుండా ఫొటోలు..వీడియోలు తీశారు. ఆ తర్వాతా అమర్(Amar gang) అనే వ్యక్తి రంగారెడ్డి ఆ మహిళలతో సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు చూపించి యోగా గురువు రంగారెడ్డిని బ్లాక్ మెయిల్(blackmail) చేయడం మొదలుపెట్టాడు. దీంతో వారికి యోగా గురువు రంగారెడ్డి పలు ధఫాలుగా చెక్కుల రూపంలో రూ.50 లక్షల ఇచ్చారు.
మరో రూ.2 కోట్లు ఇవ్వాలని అమర్ గ్యాంగ్ డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు రంగారెడ్డి తన సమస్యపై గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగారెడ్డితో అడిగిన డబ్బులు ఇస్తామని నిందితులకు చెప్పించారు. వారు డబ్బుల కోసం రాగానే అమర్ తో పాటు అతని గ్యాంగ్ సభ్యులు రాజేష్, మౌలాలి, రజిని, మంజులల(arrested)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.