న్యూఢిల్లీ : నేను శివభక్తుడి(Shiva Devotee)ని అని..మీరు నన్ను ఎంత తిట్టినా.. శివుడిలా విషాన్ని గొంతులోనే(Poison in Throat) దాచుకుంటానని..కాని ఎవరికైనా అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేను అని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అస్సాం రాష్ట్రం(Assam visit) పర్యటనలో భాగంగా ధరంగ్ జిల్లాలో మంగల్‌డోయ్‌లో రూ.6,300 కోట్ల విలువైన ఆరోగ్య, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దరంగ్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణంతో పాటు, నర్సింగ్ కాలేజీ, జీఎన్ఎమ్ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభ(Darrang) లో మోదీ మాట్లాడుతూ గాయకుడు భూపెన్ హజారికాకు భారతరత్న ఇవ్వడం మంచి నిర్ణయమా కాదా? కానీ ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించినందుకు కాంగ్రెస్ పార్టీ అవమానించింది అని అన్నారు.
దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ బాసట
కాంగ్రెస్ తన రాజకీయాల కోసం భారత్‌పై వ్యతిరేక భావజాలం ఉన్న శక్తులకు ఊతమిస్తుందని మోదీ విమర్శించారు. 1962లో చైనాతో యుద్ధం తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ ఈశాన్య ప్రాంత ప్రజలకు చేసిన గాయాలు నేటికీ మానిపోలేదన్నారు. ప్రస్తుత తరం కాంగ్రెస్ నాయకులు కూడా ఆ గాయాలపై ఇప్పటికీ ఉప్పు చల్లుతున్నారని మోదీ ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఇది బయటపడిందన్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను మన సైన్యం మట్టుబెట్టిందన్నారు. కానీ హస్తం పార్టీ మాత్రం మన సైన్యానికి కాకుండా దాయాది దేశంలోని సైన్యానికి మద్దతిస్తోందని మోదీ ఆరోపించారు. పాక్ అబద్ధాలు కాంగ్రెస్ అజెండాలుగా మారుతున్నాయన్నారు. ప్రస్తుతం ఆక్రమణదారులకు, దేశ వ్యతిరేకులకు ఆ పార్టీ రక్షణ కవచంగా మారిందంటూ.. వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు