Eenadu Ramoji Rao in Hospital | రామోజీరావు ఆసుపత్రిలో చేరిక…నిలకడగానే ఆరోగ్యం

ఈనాడు (Eenadu)సంస్థల అధిపతి రామోజీరావు(Ramoji Rao)ను తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్​లో చేర్పించారు

  • Publish Date - June 8, 2024 / 12:00 AM IST

ఈనాడు (Eenadu)సంస్థల అధిపతి రామోజీరావు(Ramoji Rao)ను తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్​లో చేర్పించారు. ఆయన మైల్డ్​ హార్ట్ ఎటాక్​(Heart Attack)కు గురైనట్లు గుర్తించిన వైద్యులు స్టంట్​ వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేసాయి. ఆయనకు ఎటువంటి వెంటిలేటర్​ సహాయం అవసరం పడలేదని వారు తెలిపారు.

ఈనాడు పత్రిక అధినేత, పద్మవిభూషణ్​ చెరుకూరి రామోజీరావు (87) తీవ్ర అస్వస్థతలో ఆసుపత్రిలో చేరారు. అకస్మాత్తుగా అయన ఇంట్లో తీవ్రంగా ఇబ్బంది పడటం గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని స్ఠార్​ హాస్పిటల్​ చేర్పించారు. అక్కడ ఆయనకు చిన్నగా గుండెపోటు వచ్చిందని తెలుసుకున్న వైద్యులు స్టెంట్​ వేసారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉన్నా, నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు వెంటిలేటర్​పై చికిత్సనందిస్తున్నట్లుగా నెట్​లో వైరల్​ అవుతున్న వార్త అవాస్తవమని ఆసుపత్రివర్గాలు తోసిపుచ్చాయి. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న రామోజీరావు వృద్ధాప్య సమస్యలతో కూడా సతమతమవుతున్నారు. మార్గదర్శి చిట్​ఫండ్​ కంపెనీ విషయంలో గత ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అవలంబించిన కక్షపూరిత వైఖరి కూడా ఆయన మనస్థాపానికి కారణమైనట్లు భావిస్తున్నారు.

 

Latest News