- ఎన్నికల సంఘం వినూత్న నిర్ణయం
విధాత : తెలంగాణ ఎన్నికల సంఘం ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వినూత్న నిర్ణయాన్ని అమలు చేయనుంది. సాధారణంగా ఓటు వేసిన ఓటర్‌కు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారని, ఇక మీదట సహాయకుడి కుడి చేతి చూపుడు వేలుకు ఇంకు పెడుతామని తెలిపింది.
ఓటర్‌కు సహాయంగా వచ్చే వ్యక్తి కూడా ఓటర్ బూత్‌కు చెందిన ఓటరై ఉండాలనే నిబంధన తెచ్చింది. అలాగే సహాయకుడు ముందుగా ఓటు వేశాకే మరో ఓటర్‌కు సహాయకుడిగా వెళ్లాలని ఈసీ వెల్లడించింది. అలాగే ఈ ఎన్నికల్లో ఉదయం పోలింగ్‌కు ముందు 5.30కు నిర్వహించే మాక్ పోలింగ్‌లో పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చోవచ్చునని ఎన్నికల సంఘం మరో కొత్త నిర్ణయం తీసుకుంది.