నాగలిపట్టి.. బురద పొలంలో గొర్రు కొట్టిన మంత్రి ఎర్ర‌బెల్లి

విధాత, వరంగల్: సహజంగా అత‌నో రైతు బిడ్డ… అందులోనూ తన సొంత పొలాన్ని చూడగానే మురిసిపోయారు.. కూలీలు చేస్తున్న వ్య‌వ‌సాయ‌ పనులు చూసి ఉరకలేశాడూ… ఇంకే ముంది మంత్రి అనేది మరచిపోయి ఆగలేక నాగలి పట్టారూ… బురద పొలంలో దిగి అరకబట్టి దున్నారూ… నడుమొంచి కూలీలతో కలిసి నాటేశారు. ఆయనే ఎర్రబెల్లి.. రాష్ట్రానికి మంత్రి అయినా… రైతు బిడ్డననేది చాటి చెప్పారు. తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో మంగళవారం పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి […]

  • Publish Date - December 27, 2022 / 09:22 AM IST

విధాత, వరంగల్: సహజంగా అత‌నో రైతు బిడ్డ… అందులోనూ తన సొంత పొలాన్ని చూడగానే మురిసిపోయారు.. కూలీలు చేస్తున్న వ్య‌వ‌సాయ‌ పనులు చూసి ఉరకలేశాడూ… ఇంకే ముంది మంత్రి అనేది మరచిపోయి ఆగలేక నాగలి పట్టారూ… బురద పొలంలో దిగి అరకబట్టి దున్నారూ… నడుమొంచి కూలీలతో కలిసి నాటేశారు. ఆయనే ఎర్రబెల్లి.. రాష్ట్రానికి మంత్రి అయినా… రైతు బిడ్డననేది చాటి చెప్పారు.

తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో మంగళవారం పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి దిగి… గొర్రు పట్టి ఎడ్లను సై అన్నారు… అల్లిస్తూ దున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు.

దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేశారంటూ పదేపదే చెప్పే మంత్రి ఎర్రబెల్లి ఆ వ్యవసాయంలో భాగస్వామ్యమైతూ పొలంలోకి దిగి బురద గొర్రు కొట్టి రైతు పట్ల గౌరవాన్ని చాటిచెప్పారు. ప్రగతిబాటలో అడుగులు వేస్తాం అనడమే కాదు.. నేరుగా వ్యవసాయం చేస్తామంటూ నిరూపించాడు. రైతు రాజు అయితే… రాజు కూడా రైతు అనే దానిని రుజువు చేస్తున్నారు.