Site icon vidhaatha

Banakacherla | బనకచర్లపై నిపుణుల కమిటీ

Banakacherla | విధాత, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రాజెక్టుపై నిపుణుల కమిటీని వేయాలని నిర్ణయించింది. నిపుణుల కమిటీలో 12 మంది ఉండనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. ఆంధ్రా, తెలంగాణ నుంచి ఐదుగురి చొప్పున పేర్లను పంపాలని కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. వీరితో పాటు మరో ఇద్దరు నిపుణులను కేంద్రమే నియమించనుంది. ఈ కమిటీలోని సభ్యులు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, పరిపాలనా అంశాలను పరిశీలించి, రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని కుదిర్చేందుకు కృషి చేయనున్నారు. దీంతో బనకచర్ల ప్రాజెక్టు వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేంద్ర భావిస్తోంది. ఇదిలా ఉంటే బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో కట్టనివ్వమని, దీనికి పూర్తిగా మేం వ్యతిరేకమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, దీనివల్ల చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతున్నది తెలంగాణ పాలకులు వెల్లడిస్తున్నారు. కేంద్రం దీనిపై నిపుణుల కమిటీ వేయడంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా స్పందిస్తోందని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Exit mobile version