హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత): జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో దారుణం. వినాయక చవితికి రూ. 1000 చందా ఇవ్వలేదని నాలుగు కుంటుంబాలను కుల బహిష్కరణ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గణపతి వద్దకు కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్తే ఆ నాలుగు కుటుంబాలను రూ. 1116 చందా ఇవ్వాలని కుల పెద్దలు చెప్పారు. దీంతో అప్పులు అయ్యాయి, తినడానికి తిండే లేదు పైసలు కట్టలేమని చెప్పారు. దీంతో ఆగ్రహించిన కుల పెద్దలు ఆ కుంటుంబాలను కుల బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. వారితో ఎవరైనా మాట్లాడితే.. రూ. 25వేలు, చూస్తే రూ. 5వేలు జరిమానా అని చెప్పారు. దీంతో ఆయా కుటుంబాలతో మాట్లాడేందుకు గానీ, చూసేందుకు గాని కులస్తులంతా నిరాకరిస్తున్నారని, తమను చూసి తలుపులు వేసుకుంటున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అప్పులు అయ్యాయి, తినడానికి తిండి లేదు పైసలు ఎలా కట్టాలని బోరునా ఏడ్చింది.
Viral Video : వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ
