Jagga Reddy | బీజేపీ నుంచే కాంగ్రెస్‌లోకి ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తారు : జగ్గారెడ్డి

రాష్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం వస్తుందన్న బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిప్పికొట్టారు.

  • Publish Date - May 14, 2024 / 06:45 PM IST

ఆ పార్టీ నేతల మాటలన్ని అబద్దాలే
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి

విధాత : రాష్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం వస్తుందన్న బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిప్పికొట్టారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీజేపీ నుంచే తమ పార్టీలోకి 5గురు ఎమ్మెల్యేలు వస్తారని, బీఆరెస్ నుంచి 25మంది వస్తారని అప్పుడు మా బలం 90కి చేరుతుందని ఇక ప్రభుత్వం ఆగస్టులో ఎందుకు పడిపోతుందంటూ కౌంటర్ వేశారు.

బీజేపీ నేతలు మోసగాళ్లకు మోసగాళ్లు అని జగ్గారెడ్డి, నమ్మించి మోసం చేసే నైజం బీజేపీలో ఉందని విమర్శించారు. ఉద్యోగాలు, నల్లధనం పేరుతో బీజేపీ అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసిందన్నారు. వేరే రాష్ట్రాల్లో చేసినట్లు జిమ్మిక్కులు ఎన్ని చేసినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఐదేళ్లు పక్కా ఉంటుందన్నారు. 68 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు కూలిపోతుందన్నారు.

తమ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, దేవుడిని ముందుపెట్టి బీజేపీపై ప్రజల్లో ఉన్న కోపాన్ని దేవుడిని ముందుపెట్టి తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని, దేవుళ్ల పేరుతో రాజకీయం చేయడం తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ధి పట్టించుకోవడం లేదన్నారు. గాంధీ కుటుంబానికి మోసం అంటే తెలియదని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Latest News