పోచారంది ఆత్మవంచన.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది

పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడానికి చెప్పిన కారణాలు చూస్తే మాకు సిగ్గు వేస్తోందని మాజీ ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్ అన్నారు

  • Publish Date - June 21, 2024 / 06:08 PM IST

మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ ,జాజుల సురేందర్

విధాత: పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడానికి చెప్పిన కారణాలు చూస్తే మాకు సిగ్గు వేస్తోందని మాజీ ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యవసాయానికి చేస్తున్న మేలు ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ లో చేరుతున్నట్టు పోచారం చెప్పడం ఆత్మవంచనే అవుతుందన్నారు. .పోచారం తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. రైతులకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరును సీనియర్ నాయకుడు పోచారం ఎందుకు మరచిపోయారో అని అన్నారు.

బాన్స్ వాడలో ప్రచారం లో రేవంత్ పోచారం కుటుంబాన్ని దండు పాళ్యం బ్యాచ్ తో పోలిస్తే..కేసీఆర్ పోచారం కు స్పీకరు పదవి ఇచ్చి, లక్ష్మి పుత్రుడని బిరుదు ఇచ్చారన్నారు. వ్యవసాయ మంత్రిగా పోచారం కు కేసీఆర్ మంచి అవకాశం ఇచ్చారన్నారు. ఈ వృద్ధాప్యం లో పోచారం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఏం సాధిస్తారని అడిగారు. స్వార్థం కోసమే పోచారం నిర్ణయం తీసుకున్నారన్నారు. .కేసీఆర్ ఏం తక్కువ చేశారని ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నావని పోచారం ని ప్రశ్నించారు. పోచారం పోవడం వల్ల బీ ఆర్ ఎస్ కు నష్టం లేదు ..కాంగ్రెస్ కు లాభం లేదన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోచారం రాకను జీర్ణించుకోవడం లేదన్నారు. ఇసుక దందాలు సాగడం లేదని పోచారం పార్టీ మారుతున్నారన్నారు ..హామీలు అమలు చేయడం చేత కాక రేవంత్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆరోపించారు. పోచారం కు దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలి ..నేనే బీ ఆర్ ఎస్ నుంచి బరి లోకి దిగుతా అని ప్రశ్నొంచారు. బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. ఆరు నెలల్లోనే రేవంత్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ మళ్ళీ అదే రాజకీయం మొదలు పెట్టారన్నారు.

Latest News