KTR| ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ కు బిగ్ షాక్

ఫార్ములా ఈ కారు రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

విధాత, హైదరాబాద్ : ఫార్ములా ఈ కారు రేసు(Formula E car race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు(ACB Investigation) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) అనుమతించారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. 2023అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నాటి నుంచి అన్ని ఎన్నికల్లోనూ పరాజయాలతో పాటు…కవిత తిరుగుబాటు ఎపిసోడ్ లతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కేటీఆర్ విచారణ వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది.

ఫార్ములా ఈ కారు రేసులో 2024 లో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేబినెట్ అనుమతి లేకుండా, ఎన్నికల కోడ్ అనుమతి లేకుండా, ఆర్బీఐ అప్రూవల్ లేకుండా విదేశీ సంస్థకు నిధుల మళ్లీంపు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఏసీబీ అభియోగాలు మోపింది. తొమ్మిది నెలల పాటు ఏసీబీ ఈ కేసు విచారణ కొనసాగించింది. ఫార్ములా ఈ కారు రేసులో 54.88కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా, క్విడ్ ప్రో జరిగినట్లుగా ఏసీబీ ఆధారాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ కేసులో 4సార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్ ను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను ఏసీబీ సేకరించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ను అయిదు సార్లు విచారించింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ను విచారించేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ 9న గవర్నర్ కు లేఖ రాసింది. 10 వారాల తర్వాత గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది.

అటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీవోపీటీ అనుమతి కొరకు ఏసీబీ ఎదురుచూస్తుంది. అక్కడి నుంచి అనుమతి రాగానే కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ ఎన్ రెడ్డి లపై ఏసీబీ చార్జీషీట్ దాఖలు చేయనుంది. ఇదే ఫార్ములా ఈ కారు రేసు కేసులో మనీలాండరీంగ్(పీఎంల్ఏ) ఆరోపణలపై డిసెంబర్ 2024న ఈడీ సైతం కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం గమనార్హం.

Latest News