విధాత: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపడుతున్నవేళ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేవంత్‌కు శుభాకాంక్షలు చెబుతూ అభిమానాన్ని చాటుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీనిపై రేవంత్ అభిమానులు మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులు.. ప్రతిపక్షం ఏర్పాటు చేసిన ప్లెక్సీలను ఉద్దేపూర్వకంగానే తొలగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.