Site icon vidhaatha

Kavitha| స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలి: కవిత

విధాత, హైదరాబాద్ : స్వర్ణకారుల వృత్తిదారులపై ప్రభుత్వం వేధింపులు మానుకోవాలని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కార్పోరేట్ నగల దుకాణాల రాకతో స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లి వారి జీవితాలు దుర్భరంగా మారిపోయాయన్నారు. మరోవైపు పోలీసులు లేనిపోని కేసులతో స్వర్ణకారులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పోలీసులు దొంగ బంగారంకు సంబంధించి దొంగలను పట్టుకోలేక.. చోరీ కేసులను క్లియర్ చేసుకునే ఎత్తుగడలో భాగంగా యాక్ట్ 411ను అడ్డం పెట్టుకుని స్వర్ణకారులపై అక్రమ కేసులు మోపుతున్నారన్నారు.

బీసీ వర్గానికి చెందిన స్వర్ణకారుల మనుగడ నేటీ రోజుల్లో అనేక రకాలుగా సవాల్ గా మారిందన్నారు. వారు ఆత్మహత్యలు చేసుకోవద్దని..బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలని కవిత కోరారు. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. అదే సమయంలో స్వర్ణకారుల వృత్తిదారులను వేధించేందుకు కారణమవుతున్న యాక్ట్ 411ను సవరించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version