విధాత: పంద్రాగస్టు లోపు రూ. 39 వేల కోట్ల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా..? అని సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ఆయన బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇంకా రైతుబంధు ఇవ్వనే ఇవ్వలేదు.. కానీ ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడని రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారెంటీలే మీకు భస్మాసురహస్తం అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అన్నారు. మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు రూ. 2500 సహాయం, కళ్యాణాలక్ష్మి కింద తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను ఓడించాలని హరీశ్‌రావు సూచించారు.నాలుగున్నర నెలల్లోనే ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అంటే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కలేదు.. మీ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారు. మీ పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, హనుమంతరావులే మా సీఎం కలవట్లేదు అని అంటున్నారు. మెడలో పేగులేసుకుంటా, మానవ బాంబునై పేలుతా, డ్రాయర్ ఊడగొడుతా అని సీఎం పదవికి అర్థం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని హరీశ్‌రావు విమర్శించారు.
పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా.. సీఎంకు హరీష్ రావు ఛాలెంజ్
పంద్రాగస్టు లోపు రూ. 39 వేల కోట్ల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా..? అని సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ఆయన బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని సందర్భంగా మీడియాతో మాట్లాడారు

Latest News
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
నకిలీ ట్రాఫిక్ చలాన్ మెసేజ్‌లు వస్తున్నాయి… అప్రమత్తంగా ఉండండి
ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు : మంత్రి పొంగులేటి
కివీస్‌దే వన్డే సిరీస్ – కోహ్లీ శతక పోరాటం వృథా
తల్లుల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి
సక్సెస్‌తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ.
వార్తలు అడిగి రాయండి: సీఎం రేవంత్ రెడ్డి
హీరోయిన్ ఎంగిలి తాగమన్న డైరెక్టర్..
భారత్ నాకు ఇల్లు..వివాదస్పద వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ
మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా