Heavy Rains | ఇవాళ, రేపు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. 13 జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ..!

Heavy Rains | తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రిస్తున్నాయి. ఈ కార‌ణంగా మంగ‌ళ‌, బుధ‌వారాల్లో రాష్ట్రంలో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఉరుములు, మెరుపుల‌తో పాటు ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

  • Publish Date - June 11, 2024 / 07:41 AM IST

Heavy Rains | హైద‌రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రిస్తున్నాయి. ఈ కార‌ణంగా మంగ‌ళ‌, బుధ‌వారాల్లో రాష్ట్రంలో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఉరుములు, మెరుపుల‌తో పాటు ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో 13 జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

మంగళవారం నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నాగర్‌ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని ఆ శాఖ అధికారులు తెలిపారు.

బుధవారం నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌ మేడ్చల్‌ మల్గాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నాగర్‌ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అల‌ర్ట్‌ను జారీచేశారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉన్నదని వాతావారణ శాఖ తెలిపింది.

ఆదివారం నుంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు రాష్ట్రంలో అత్య‌ధికంగా వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల‌, దోమ‌, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిల‌లో 3 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మ‌రికొన్ని జిల్లాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురిశాయి.

Latest News