Site icon vidhaatha

Damodar Rajanarsimha | సంగారెడ్డిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు..త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి రాజనర్సింహ

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి.. స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా కొనసాగిన శకటాల ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేస్తూ, ఆకట్టుకునే రీతిలో శకతాల ప్రదర్శన కొనసాగింది. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. వివిధ శాఖలు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను తిలకించారు . అనంతరం జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు రెండువందల యాభై ఐదు కోట్ల పది లక్షల రూపాయలచెక్ ను అందించారు. పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. ప్రభుత్వ , ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక దేశభక్తి గేయాలపై ఎంతో అలవోకగా చూడచక్కని రీతిలో ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి మంత్రి, జిల్లా కలెక్టర్ , ప్రత్యేకంగా అభినందిస్తూ, బహుమతులు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికవసతుల చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు , జిల్లా ఎస్ పి రూపేష్ , అదనపుకల్లెక్టర్ లు చంద్రశేఖర్ ,మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్ ,సంగారెడ్డి మునిసిపల్ చైర్మన్ విజయలక్ష్మి, అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు

 

 

Exit mobile version