ప్రజా ప్రభుత్వం అంటూ మీడియాపై ఉక్కు పాదమా?

తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానళ్లలో BARC India తాజా గణాంకాల ప్రకారం 60 శాతం మించి వీక్షకాదరణ ఉన్న 4 ప్రధాన న్యూస్ చానళ్లపై ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం న్యాయమా

  • Publish Date - June 27, 2024 / 07:28 PM IST

తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానళ్లలో BARC India తాజా గణాంకాల ప్రకారం 60 శాతం మించి వీక్షకాదరణ ఉన్న 4 ప్రధాన న్యూస్ చానళ్లపై ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం న్యాయమా?నియంతృత్వ ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ మరోపక్క, మీడియా స్వేచ్చను ఆడ్డుకునేలా నెంబర్ వన్ న్యూస్ చానల్ టీవీ9 సహా 4 ప్రధాన న్యూస్ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం ఎలాంటి ప్రజాస్వామ్యం?

కోట్ల మంది ప్రజల ఆకాంక్షల మేరకు అధికారంలోకి వచ్చిన మీరు అదే కోట్ల మంది జనం ఆదరించే న్యూస్ చానళ్ల ఉనికే లేకుండా చేయాలని కుట్ర చేయడం ప్రజావ్యతిరేక చర్య అనిపించుకోదా?నాలుగు ప్రధాన న్యూస్ చానళ్ల ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో కేబుల్ ఆపరేటర్లు అడ్దుకోవడంపై ఢిల్లీ హైకోర్టు కన్నెర్ర చేసినా కిమ్మనకపోవడం కోర్టు ధిక్కరణ కాదా?ఇలానే గతంలో న్యూస్‌ చానళ్లకు సంకెళ్లు వేసిన కేసీఆర్, జగన్‌ ప్రభుత్వాలు చివరికి ఏమయ్యాయో తెలిసీ కూడా పరిణతి చెందిన ప్రజానాయకుడు చంద్రబాబునాయుడు తన పాలనలో మీడియాను నియంత్రించాలనుకోవడం ఏవిధంగా సబబు?

Latest News