Site icon vidhaatha

రాముడి నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే: జగ్గారెడ్డి

రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్..
మోడీ పవర్ కోసం వచ్చిన లీడర్

విధాత : రాముడి నిజమైన వారసుడు..ఆయన ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్‌గాంధీ మాత్రమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. పేదల కోసం రాముడు పాలన చేశారని, గుడి నిర్మాణం చేస్తే సంతోషిస్తా అని రాముడు చెప్పలేదన్నారు. రామాలయం నిర్మాణంతో దేశ ప్రజల సమస్యలు తొలగిపోయయా అని ప్రశ్నించారు. రాహుల్ ముందు.కిషన్ రెడ్డి.. ఈటెల.. సంజయ్‌లు చాల చిన్న వ్యక్తులని, వారు రాహుల్ గాంధీ చరిత్ర, రాజకీయం మీద మాట్లాడుతుండటం విడ్డూరమన్నారు. ఈ రోజు దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోదీ చుట్టే తిరుగుతున్నాయన్నారు. అద్వానీ రథయాత్రకి ముందు దేశానికి .. గుజరాత్ కి మోదీ ఎవరో కూడా తెలియదన్నారు. అద్వానీ రథయాత్ర పూర్తి అయ్యాక.. గుజరాత్ ఎన్నికలల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోదీ గెలిచిన తర్వాత అద్వానీ సిల్డ్ కవర్ లో సీఎం గా ప్రకటించారన్నారు. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్‌లో డిసైడ్ చేశారని గుర్తు చేశారు. సీఎం లను డిసైడ్ చేసే రాహుల్ గాంధీకి.. సీల్డ్ కవర్ సీఎం మోదీకి చాలా తేడా ఉందన్నారు. మోదీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని, రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని, మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్ అని విమర్శించారు. అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోదీ అయితే ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అంటే యూపీఏ ప్రభుత్వంలోనే ప్రధాని అయ్యే వాడన్నారు. మన్మోహన్‌సింగ్ స్వయంగా రాహుల్‌గాంధీని ప్రధానిగా బాధ్యతలు చేపట్టమంటే ఆయన మన్మోహన్‌సింగ్‌ను పెట్టారన్నారు.

సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేస్తూ ఎదిగిన వ్యక్తి మోదీ అని, ప్రజలతో మమేకమైన నాయకుడు కాదని విమర్శించారు.
మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో పాదయాత్ర మాదిరిగా రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేశారని, పేదలను తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ అన్ని వర్గాల ప్రజల ఆర్థికంగా బలోపేతం కోసం ఆలోచన చేసే వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. మేధావులతో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుంటూ.. ప్రజల అవసరాలను గుర్తిస్తున్నారన్నారు. ప్రజల కష్టనష్టాలను తెలుసుకునేందుకు భారత్ జోడో, న్యాయ యాత్రలు చెశారని, ప్రజలను మభ్య పెట్టాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. తెలంగాణలో 14 స్థానాలు ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకునేందుకు వెన్నుముకలుగా మన ఎంపీలు నిలుస్తారని జోస్యం చెప్పారు. సీట్ల కేటాయింపులతో సమస్యలు పోవన్నారు. అధికారంలో ఎన్నాళ్లు ఉన్నామనే దానికంటే ప్రజలు ఎంత తృప్తితో జీవిస్తున్నారన్నదే రామరాజ్యమని వ్యాఖ్యానించారు. 67ఏళ్ల కాంగ్రెస్ పాలనలో.. 56 లక్షల కోట్లు అప్పు ఉంటే.. పదేళ్ళలో మోదీ పాలనలో అప్పులు డబుల్ అయ్యాయాని, రాముడు మోదీకి అప్పులు చేయమని చెప్పాడా.. ఏ గ్రంథంలో అప్పులు చేయమని ఉందంటూ ప్రశ్నించారు.

Exit mobile version