Site icon vidhaatha

Jeedimetla | జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వికృత చేష్టలు

Jeedimetla |

విధాత, హైదరాబాద్: జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
రాత్రి వేళల్లో ట్రావెల్స్ బస్సులను ఆపి, డ్రైవర్లను కాలితో తన్నుతూ, బూతులు తిడుతూ, కొట్టి హింసిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ట్రాఫిక్ ను నియంత్రిస్తూ, వాహనదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన ట్రాఫిక్ పోలీసులు, వారి శాడిజాన్ని బస్సు డ్రైవర్లపై ప్రదర్శిస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు.

డ్రైవర్ తప్పిదం ఏమైనా ఉంటే, ఛలానా వేసి కేసులు పెట్టాల్సిన పోలీసులు.. డబ్బు కోసం వారిని హింసిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు.

ఫ్రెండ్లీ పోలీసులమని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం, వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

రాత్రి 10 గంటల తర్వాత ట్రావెల్స్ బస్సులు తిరిగేందుకు అనుమతి ఉన్నా… కేవలం డబ్బుల వసూలుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

Exit mobile version