Site icon vidhaatha

Karnataka | తండ్రికి ట్రాన్స్​ఫర్.. అదే స్థానంలో కూతురుకు పోస్టింగ్!

Karnataka |

విధాత: ఇప్పటివరకు తాను పని చేస్తున్న పోలీస్ స్టేషన్​కు ఎస్​ఐగా వచ్చిన కుమార్తెకు స్వయంగా బాధ్యతలు అప్పగించారు ఆమె తండ్రి. తండ్రి పోస్టులోకి కూతురు.. కొత్త SIకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించాడు నాన్న.

ఈ అరుదైన సన్నివేశానికి కర్ణాటక మండ్యలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్​ వేదికైంది. ఇప్పటివరకు ఆ ఠాణాకు సబ్​ఇన్​స్పెక్టర్​గా ఉన్న బీఎస్​ వెంకటేశ్​ బదిలీ కాగా.. ఆ స్థానంలో ఆయన కుమార్తె బీవీ వర్షను ప్రభుత్వం నియమించింది.

బుధవారం వర్షకు.. ఆమె తండ్రి వెంకటేశ్​ ఛార్జ్ అప్పగించారు. మండ్య ఎస్​పీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఈ సమయంలో తండ్రీకూతుళ్లు భావోద్వేగానికి లోనయ్యారు.

Exit mobile version