Minister Konda Sureka: షేక్ పేట్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం సంతోషంగా ఉంది

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా... కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇచ్చిన షేక్ పేట్ డివిజన్ లోని బూత్ లలో హస్తం పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ రావడం జరిగింది. ఇందుకు మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్, నవంబర్ 14(విధాత): తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా… కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇచ్చిన షేక్ పేట్ డివిజన్ లోని బూత్ లలో హస్తం పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ రావడం జరిగింది. ఇందుకు మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు.

పార్టీ అధి నాయకత్వం ఇచ్చిన బాధ్యతను తాను సంపూర్ణంగా నిర్వర్తించినట్టు ఈ సందర్భంగా మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. దాంతోపాటు, తమ నియోజకవర్గం వరంగల్ నుండి సుమారు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేతలు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు షేక్ పేట్ డివిజన్ వచ్చి నెల రోజుల పాటు ప్రతి ఇంటింటికి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కి ఓట్లను అభ్యర్థించారని స్పష్టం చేశారు.

ముఖ్యంగా మహిళ ఓటర్లు తమ వైపు నిలిచారని … ఎందుకంటే తమది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని కొండా సురేఖ పునరుద్ఘాటించారు. బీసీ బిడ్డ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ ఉప ఎన్నికలో గెలవబోతున్నారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీ బిడ్డ, అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, ఓటర్లు తమ డివిజన్… మొదట్లో రౌండ్లో అభ్యర్థికి మెజారిటీ ఇవ్వడం సంతోషం కలిగించిందని మంత్రి సురేఖ వివరించారు.