Maganti Sunitha : జూబ్లీహిల్స్‌లో రౌడీయిజమే గెలిచింది

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రౌడీయిజమే గెలిచిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెల్లడించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆమె అన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపల ర్యాగింగ్ చేశారు

Maganti Sunitha

హైదరాబాద్, నవంబర్ 14(విధాత): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రౌడీయిజమే గెలిచిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెల్లడించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆమె అన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపల ర్యాగింగ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. గోపీనాథ్ ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నవారి ఆటలు సాగలేదని, అందుకే రెగ్గింగ్ చేశారన్నారు. మా ఇంటి మనిషి చనిపోయినప్పుడు నాకు బాధ ఉండదా.. కార్యకర్తల కోసం మాట్లాడిన తప్పు అర్థం తీశారు. దీనిని గెలుపు అంటారని అనుకోవడం లేదు నైతికంగా జూబ్లీహిల్స్ లో నేనే గెలిచాను అని సునీత తెలిపారు.

Also Read:

Jubilee Hills Congress Candidate Naveen Yadav Wins | జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం

కాగా.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 24,658 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్‌ యాదవ్‌ పత్రి రౌండ్ లోనూ ఆధిక్యం కనబరిచారు. ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. మొత్తం 10రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 24,658ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పోలింగ్ ముగిశాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేసుకున్న అంచనా మేరకు మెజార్టీ సాధించడం గమనార్హం.