కేసీఆర్‌, జగదీశ్‌రెడ్డిలు కలిసే విద్యుత్తు కొనుగోళ్లలో అక్రమాలు చేశారు … ఎమ్మెల్యే వేముల వీరేశం

: మాజీ సీఎం కేసీఆర్‌, విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కయ్యే విద్యుత్తు కొనుగోలు, ఫ్లాంట్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారని, వారి నిర్వాకంతోనే విద్యుత్తు రంగం 80వేల కోట్ల అప్పుల పాలైందని నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు.

  • Publish Date - June 30, 2024 / 04:52 PM IST

వారి నిర్వాకంతోనే విద్యుత్తు రంగం 80వేల కోట్ల అప్పుల పాలు
కమిషన్ ముందు హాజరై నిజాయితీ నిరూపించుకోవాలి

విధాత , హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్‌, విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కయ్యే విద్యుత్తు కొనుగోలు, ఫ్లాంట్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారని, వారి నిర్వాకంతోనే విద్యుత్తు రంగం 80వేల కోట్ల అప్పుల పాలైందని నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. ఆదివారం ఆయన కట్టంగూర్‌లో మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లాకు రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప చరిత్ర ఉన్నదని, జగదీష్ రెడ్డి నల్లగొండ జిల్లా పరువు తీస్తున్నాడని విమర్శించారు. విద్యుత్తు రంగంలో జరిగిన అవకతవకలపై జగదీశ్‌రెడ్డి తప్పించుకోవాలని చూస్తున్నాడన్నారు. అసెంబ్లీలో జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసిన జగదీశ్‌రెడ్డి విచారణ కమిషన్ ముందు హాజరై తన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అవసరాలకు మించి చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు ఎక్కువ కొనాల్సిన అవసరం ఏమి వచ్చిందో జగదీశ్‌రెడ్డి వెల్లడించాలని, జగదీష్ రెడ్డి సుద్దపూస మాటలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయని విమర్శించారు. తప్పు చేయకుంటే జగదీశ్‌రెడ్డి విద్యుత్తు రంగ అక్రమాలపై విచారణ చేస్తున్నజ్యుడీషియల్ కమిషన్‌ ముందు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. కమిషన్‌కు లేఖలు రాసి తప్పించుకోకుండా చైర్మన్ ముందు మీడియా సమక్షంలో విచారణకు కూర్చోవాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్ కేంద్రాల వద్ద లాగ్‌ బుక్కులు మంత్రి కోమటిరెడ్డి పరిశీలించడం మూలంగానే విద్యుత్తు అవినీతి బయటకు వచ్చిందన్నారు. ఉచిత విద్యుత్తు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే అని వేముల వీరేశం స్పష్టం చేశారు.

Latest News