జాతీయ రహదారి 65(NH 65).. హైదరాబాద్ విజయవాడ(Hyderabad to Vijayawada)లను కలిపే ప్రధాన రహదారి. నిత్యం ఎంతో బిజీగా ఉండే ఈ రోడ్డును 6 వరుసలు(6 Lane)గా చేసేందుకు కేంద్రం ఈమధ్యే అనుమతులు మంజూరు చేసింది. మధ్యలో ఉండే పెద్ద పట్టణం సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రం. ఇక్కన్నుంచి ఖమ్మం(Khammam) జిల్లా కేంద్రానికి వెళ్లే ఇంకో జాతీయ రహదారి 365బిబిNH 365BB), సూర్యాపేట జిల్లా టేకుమట్ల(Tekumatla) వద్ద ఎన్‌హెచ్ 65ను కలుస్తుంది. అయితే ఇక్కడో విచిత్రమైన సమస్య ఏర్పడింది. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్లే వాహనదారులు టేకుమట్ల వద్ద ఎన్‌హెచ్ 65 నుండి దిగి నేరుగా 365బిబి మీదుగా ఖమ్మం వెళ్లిపోవచ్చు. కానీ, ఖమ్మం నుండి హైదరాబాద్(Khammam to HYD)కు వచ్చే ప్రయాణీకులకు మాత్రం ఎన్‌హెచ్ 65 ఎక్కేందుకు దారిలేదు. వారలాగే ఓ మూడు కిలోమీట్లరు సూర్యాపేట వైపుగా వెళ్లి అక్కడ యూటర్న్(U-Turn) తీసుకుంటేనే హైదరాబాద్ వైపు హైవే 65 ఎక్కగలరు.
ఈ ఇబ్బందిని అధిగమించాలంటే ఖమ్మం నుండి వచ్చే వాహనాలు హైవే 365బిబి నుండి నేరుగా హైవే 65 ఎక్కేందుకు టేకుమట్ల జంక్షన్ వద్దే ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తే ఈ మూడు కిలోమీటర్ల యూటర్న్ బాధ తప్పుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి గానూ ఎన్నోసార్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖామంత్రి(Minister of Road Transport and Highways of India) నితిన్ గడ్కరీ(Nitin Gadkari)ని వ్యక్తిగతంగా కలిసి వినతులిచ్చిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(Vaddiraju Ravidhandra) ఎట్టకేలకు దాన్ని సాధించగలిగారు. ఈ విషయంలో సూర్యాపేట ఎమ్మెల్యే, అప్పటి రాష్ట్రమంత్రి జగదీశ్‌రెడ్డి(Guntakandla jagadeesh Reddy) కూడా చాలా ప్రయత్నాలు చేసారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ(NHAI) ద్వారా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించనుంది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో ఖమ్మం వాసుల యూటర్న్ కష్టాలు తీరిపోతాయి.
Tags: