Site icon vidhaatha

K. Kesava Rao | ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన కేకే

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ కె. కేశవ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, ఎమ్మెల్యే లు దానం నాగేందర్, గణేష్, కాలే యాదయ్య, ఎంపీ మల్లు రవి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మిలు హాజరై కేకేకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా కేకే పనిచేశారు. ఇటీవల బీఆరెస్ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరిన కేకే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆయనను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు.

Exit mobile version