Site icon vidhaatha

Siddipeta: వచ్చే సంవత్సరం.. కొండ‌పోచ‌మ్మ పున‌ర్నిర్మాణ పనులు: మంత్రి తలసాని

విధాత, మెదక్ బ్యూరో: కొండ పోచమ్మ(Kondapochamma) దేవాలయం పునర్ నిర్మాణం పనులు(reconstruction works) వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర మత్స్య పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani Srinivas yadav) అన్నారు. ఆదివారం నాడు సిద్దిపేట(Siddipeta) జిల్లా జగదేవాపుర్ మండల పరిధిలో గల కొండపోచమ్మ దేవతను మంత్రి శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్ రజిత రమేష్, ఆలయ అర్చకులు మంత్రికి ప్రత్యేక స్వాగతం పలికారు.

అనంతరం ప్రధానాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆనవాయితీగా కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న అనంతరం కొండపోచమ్మ దేవతను దర్శించుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు కొండపోచమ్మ దేవతలను దర్శించుకోవడం జరిగింది అన్నారు. దేవాలయం వద్ద మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించవలసి ఉందన్నారు. ఆ పనులన్నీ త్వరలోనే మొదలుపెట్టడం జరుగుతుందని తెలిపారు.

Exit mobile version