KTR vs Konda Surekha | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR )పై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ( Konda Surekha )సంచలన ఆరోపణలు చేశారు. హీరో నాగచైతన్య( Naga Chaitanya ) – సమంత( Samantha ) విడాకులకు కేటీఆరే కారణం అని, ఇది నగ్న సత్యమని ఆమె కామెంట్ చేశారు. కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి అని కేటీఆర్ చేసిన కామెంట్‌పై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు.
నేను దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తాను. స్వయంగా నా క్యారెక్టర్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టినప్పుడు బాధ ఉంటుంది కదా..? గతంలో ఇదే కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్. నాగచైతన్య – సమంత విడాకులకు కూడా కేటీఆర్ కారణం. కొంతమంది హీరోయిన్లు సినిమాల నుంచి తప్పుకోవడానికి కూడా కేటీఆరే కారణం. చాలా మంది హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేసి వారి జీవితాలతో ఆడుకున్నాడు కేటీఆర్. నీవు తల్లికి పుట్టలేదా.. పెళ్లి చేసుకోలేదా.. పిల్లలను కనలేదా.. మనిషివి కాదా..? అని కేటీఆర్‌పై కొండా సురేఖ మండిపడ్డారు.
నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. నాపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టాం. పోలీసులు చర్యలు తీసుకుంటారు. బీజేపీ ఎంపీ రఘనందన్ రావు ప్రెస్‌మీట్‌ను ఆహ్వానిస్తున్నా. మొన్న అసెంబ్లీలో సబితక్కను.. ఆ అక్కలను నమ్ముకుంటే అని సీఎం మాట్లాడితే ఆర్భాటం చేసి ఇష్యూ చేశాడు కేటీఆర్. ఈరోజు బీసీ మహిళా మంత్రి మీద అసభ్యకరంగా ఎందుకు పోస్టులు పెడితే ఖండించడం లేదు. రాజకీయం వేరు.. వ్యక్తిగతంగా మాట్లాడడం వేరు. నాపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయి నుంచి జరుగుతున్నాయి. గతంలో విజయలక్ష్మి, సీతక్కపై ట్రోల్స్ చేశారు. ఇవాళ నన్ను బలి చేస్తున్నారు. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్లు కొండా సురేఖ తెలిపారు.