Site icon vidhaatha

జ్యూవెలరీ షాపులో కుమారి ఆంటీ సందడి

విధాత : తన టిఫిన్ సెంటర్‌తో నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం ద్వారా సోషల్ మీడియాలో పాపులరైన కుమారి అంటీ తాజాగా కల్యాణ్ జ్యూవెలర్స్‌లో బంగారు ఆభరణం కొనుగోలు వీడియోతో మరోసారి సందడి చేసింది. మాలాంటి మహిళలకు తమకు ఇష్టమైన బంగారు నగలను వాయిదాల పద్దతిలో కొనుగోలు చేస్తారని.. తాను కూడా అలాగే పదేళ్ల నుంచి కొనుగోలు చేస్తున్నానంటూ వీడియోలో ఆభరణం చేతపట్టుకుని చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి.

కుమారి ఆంటీ టిఫిన్ సెంటరను ఆ మధ్యన ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో పోలీసులు తొలగించగా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పునరుద్దరించబడిన ఘటనతో ఆమె మరింత పాపులరైంది. ఆ తర్వాతా నిరుద్యోగులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో కుమారి ఆంటీ టిఫిన్ సెంటర్ వద్ద ఆందోళన చేయడం ఆమె పాపులారిటీని చాటింది. తాజాగా కల్యాణ్ జ్యూవెలర్స్‌లో ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version