Liquor supply | హైదరాబాద్ : మందు బాబులకు షాకింగ్ న్యూస్.. తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా మద్యం( Alcohol ) సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా( Liquor supply ) నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరా( Liquor supply ) పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో( Wine Shops ) మద్యం నిల్వలు సరిపడా లేకపోవడంతో మందుబాబులు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం అర్ధరాత్రి లోపు సర్వర్ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మందుబాబులు ఆగం అవుతున్నారు.