మంద జగన్నాథం నామినేషన్ తిరస్కరణ

నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ఎంపీ మంద జగన్నాథం నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు

  • Publish Date - April 26, 2024 / 04:24 PM IST

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ఎంపీ మంద జగన్నాథం నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టిన అధికారులు మంద జగన్నాథం నామినేషన్ వేసిన సందర్బంగా పార్టీ బీ ఫారాన్ని సమర్పించలేదు. ఈ పార్టీ బీ ఫారం ను యూసుఫ్ అనే వ్యక్తి కి కేటాయించడం తో మంద నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.

స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసే అధికారం కూడా ఆయనకు లేకుండా పోయింది. స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేయాలంటే ఆయన నామినేషన్ వేసే సమయంలో కనీసం పది మంది ఓటర్లు ప్రత్తిపాదించాలి. కేవలం ఐదు మంది మాత్రమే ఆయన నామినేషన్ ను ప్రత్తిపాదిం చారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి గా కూడా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇటీవలే బీఎస్పీ లో చేరి ఆ పార్టీ అధినేత్రి మాయవతి నుంచి టికెట్ కేటాయించుకుని వచ్చారు. కానీ ఆయనకు బీ ఫారం ఇవ్వకపోవడంతో నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

Latest News